AP Employee Service Rules: Key Questions and Answers (సందేహాలు – సమాధానాలు)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం అనుసరించవలసిన సేవా నియమాలు, జీతాలు, ప్రమోషన్లు, సెలవులు, మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై వివరణాత్మకమైన ప్రశ్నలు మరియు సమాధానాలు. ఈ సమాచారం ఉద్యోగులకు తమ హక్కులు, విధులు, మరియు ఇతర సేవా సంబంధిత అంశాలపై అవగాహన కల్పిస్తుంది.
1.ప్రశ్న:*
ఉద్యోగి రెగ్యులర్ ఇంక్రిమెంటు ముందురోజే రిటైర్‌మెంట్ అయితే అ ఇంక్రిమెంటును కూడా ‘పేలో కలుపుకొని పెన్షను లెక్కిస్తారా?
**జవాబు**:
అలా మంజూరు చేసే ఇంక్రిమెంటు “నోషనల్ ఇంక్రిమెంటు” దీనిని పేలో కలుపుకొని పెన్షను లెక్కిస్తారు. కాని ఏ ఇతర ప్రయోజనాలకు దీనిని పరిగణించరు.
రూలు 32.
Executive Instruction (iv)
GOMsNo. 235, F&P (FWRI Dept, dt. 27-10-1998,
2.ప్రశ్న*
కంపన్‌సేట్ అలవెన్సు ఎప్పుడు మంజూరు. చేస్తారు?
**జవాబు**:
సాధారణంగా Dismiss మరియు Remove చేసిన ఉద్యోగికి పెన్షను/గ్రాట్యూటీ లభించదు కాని కొన్ని అసాధారణ సందర్భాలలో చేసే Dismiss/Remove చేసే అధికారి ఉద్యోగికి Invalid పెన్షను /గ్రాట్యూటీలో 2/3 మించకుండా మంజూరు చేయవచ్చు.
రూలు -40
కాంపన్‌సేట్ అలవెన్సు రూలు 45 లోని నిబంధనలకు అనుగుణంగా మంజూరు చేయాలి, రూలు -41
3.ప్రశ్న*
ఉద్యోగి ఎక్కువ సర్వీసు చేస్తే ఎక్కువ వెయిటేజీ ఇస్తారా?
**జవాబు**:
సూపరాన్యుయేషన్ ద్వారా రిటైరు అయిన ఉద్యోగులకు వారి సర్వీసుతో నిమిత్తం లేకుండా పుల్ పెన్షన్‌ను పొందటానికి సరిపడు సర్వీసుకు మించకుండా అంటే 33 సంవత్సరాలు మించకుండా వెయిటేజీ కలుపుతారు.అంటే 33 సంవత్సరాలకు తక్కువ పడితే సర్వీసు 5 సంవత్సరాలకు మించకుండా వెయిటేజీ కలుపుతారు.
రూలు 29 Executive Instruction (i)
Govt. Memo No 57233-B/8 10/Pen-I/81-1 F&PEW Pen-I, Dept., dt. 28-4-1982.
4.ప్రశ్న:
స్థానికతను ఎలా నిర్ణయిస్తారు..?
**జవాబు**:
జి.ఓ.నెం:674,తేదీ: 20-10-1975,జి.ఓ నెం:168, తేదీ:10-03-1977 ప్రకారం ఒక వ్యక్తి 4వ తరగతి నుండి 10 వరకు గల 7 సంవత్సరాల కాలంలో ఏ జిల్లాలో ఎక్కువ చదివితే అది అతని స్థానిక జిల్లాగా గుర్తించాలి.
5.ప్రశ్న:
EOL పెట్టిన కారణంగా ఇంక్రిమెంట్ నెల మారితే తిరిగి పాత ఇంక్రిమెంట్ నెల ఎలా పొందవచ్చు..?
**జవాబు**:
జి.ఓ.నెం:43, తేదీ: 05-02-1976 ప్రకారం వైద్య కారణాలతో EOL లో ఉన్నప్పటికీ సంబందిత వైద్య ద్రువపత్రాలతో డీఈఓ గారి ద్వారా CSE కి ప్రపోసల్స్ పంపి అనుమతి పొందితే పాత ఇంక్రిమెంట్ నెల కొనసాగుతుంది. 180 రోజులకు మించిన EOL అయితే విద్యాశాఖ కార్యదర్శి నుండి అనుమతి పొందాలి.
6.ప్రశ్న:
EL’s ను ఉద్యోగి ఖాతాలో ఎలా జమ చేస్తారు..?
**జవాబు**:
01-01-1978 ముందు వరకు డ్యూటీ పీరియడ్ అయిన తరువాతే EL’s జమ చేసేవారు. జి.ఓ.నెం:384,తేదీ: 05-11-1977 నుండి జనవరి 1న ఒకసారి, జులై 1న ఒకసారి అడ్వాన్స్ గా EL’S క్రెడిట్ చేస్తున్నారు. నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి జనవరి 1న 15, జులై 1న మరో 15 EL’S సర్వీస్ ఖాతాలో జమ చేయగా, వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి జనవరి 1న 3, జులై 1న మరో 3 EL’S సర్వీస్ ఖాతాలో జమ చేస్తారు.
7.ప్రశ్న:
లీవ్ నాట్ డ్యూ అంటే ఏమిటి..?
**జవాబు**:
ఒక ఉద్యోగి లీవ్స్ ఖాతాలో హాఫ్ పే లీవ్స్ గానీ EL’S గానీ లేనపుడు ఉద్యోగికి కల్పించబడిన సౌకర్యమే లీవ్ నాట్ డ్యూ. ఒక ఉద్యోగికి అత్యవసరంగా లీవ్స్ అవసరం అయ్యి ఖాతాలో హాఫ్ పే లీవ్స్ గానీ EL’S గానీ లేనపుడు భవిష్యత్తులో ఉద్యోగికి వచ్చే హాఫ్ పే లీవ్స్ ను లెక్కించి 180 రోజుల వరకు వైద్య కారణాల నిమిత్తం లీవ్ నాట్ డ్యూ మంజూరు చేస్తారు. లీవ్ నాట్ డ్యూ గా మంజూరు చేసిన సెలవుల ను హాఫ్ పే లీవ్స్ ఉద్యోగి ఖాతాలో జమ కాగానే తగ్గిస్తారు.
8.ప్రశ్న:
మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా? వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?
**జవాబు**:
రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు. ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు. సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది. అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది.
9.ప్రశ్న:
ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?
**జవాబు**:
అవును. G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.
10.ప్రశ్న:
పెన్షన్ మంజూరుకు ప్రాతిపదిక ఏమిటి?
**జవాబు**:
భవిష్యత్తు సత్ర్రవర్తన ఆధారంగానే పెన్షను మంజూరు చేస్తారు. (Subject to future good conduct) ప్రవర్తన బాగాలేకపోతే, పెన్షన్ మంజూరు అధికారి, పెన్నన్‌ను రద్దుచేయవచ్చు, తగ్గించవచ్చు.రూలు -8
11.ప్రశ్న:
ఎ.పి. రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ఎప్పటినుండి అమలులోకి వచ్చాయి?
**జవాబు**:
29.10.1979 నుండి అమలులోకి వచ్చాయి.రూలు -1
12.ప్రశ్న:
ఎ.పి. రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి?
**జవాబు**:
1.9.2004 కి ముందు నియమింపబడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎపి, రివైజ్డ్ పెన్షన్ రూల్స్ వర్తిస్తాయి. అంటే, 1.9.2004 తరువాత నియమితులైన వారికి వర్తించవు. వీరికి క్రొత్త పెన్షన్ పథకము. (కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకము) వర్తిస్తుంది.
(రూలు2 G(i)-GO Ms.No. 653, Fin. (Pen-I) Dept., dt. 2-9-2004)
13.ప్రశ్న: 👨🏫 ఒక ఉపాధ్యాయుడు అప్రెంటీస్ కాలంలో 50 రోజులు జీతనష్టపు సెలవు పెట్టుకుని ఇన్-సర్వీస్ B.Ed కి వెళ్ళారు. అప్రెంటీస్ కాలంలో జీతనష్టపు సెలవు వాడుకోవచ్చునా? ఆ కాలాన్ని నోషనల్ ఇంక్రిమెంట్ కోసం పరిగణిస్తారా?
**జవాబు**: ✔️ అప్రెంటీస్ కాలంలో జీతనష్టపు సెలవు తీసుకుంటే, ఆ సెలవు కాలాన్ని పరిగణనలోకి తీసుకుని అప్రెంటీస్ పీరియడ్ పొడిగించబడుతుంది.
14. ప్రశ్న: 🌍 ప్రభుత్వ అనుమతితో 16.03.2024 నుండి విదేశాలకు వెళ్ళితే, వేసవి సెలవుల అనంతరం జాయిన్ అయితే, వేసవి సెలవులకు అనుమతిస్తారా?
**జవాబు**: ✅ 16.03.2024 నుండి వేసవి సెలవుల ముందు రోజు వరకు సెలవు మంజూరు చేస్తారు. వీటిని వేసవి సెలవులకు అనుసంధానంగా వాడుకోవచ్చు. అయితే, ముందుగా దరఖాస్తు చేయాలి.
15. ప్రశ్న: 🏫 హైస్కూల్ ప్లస్ లో పనిచేస్తున్న పీజీటిలకు ఇచ్చిన ఇంక్రిమెంట్ మూలవేతనంలో కలపవచ్చా?
**జవాబు**: ❌ హైస్కూల్ ప్లస్ లో పనిచేస్తున్న పీజీటిలకు ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ డిటిఏ ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం, ఈ ఇంక్రిమెంట్ వారి మూలవేతనంలో కలపరాదని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.
16. ప్రశ్న: 💸 ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుడు 75,000/- మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రతిపాదనలు ఎలా పంపుకోవాలి?
**జవాబు**: 🖥️ ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రతిపాదనలు ఆన్లైన్ ద్వారా CSE కి పంపుకోవాలి. అందుకోడానికి cse.ap.gov.in వెబ్ సైట్ లో లాగిన్ అయి ప్రతిపాదనలు అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది.
17. ప్రశ్న: 👩🎓 ఒక ఉపాధ్యాయినికి భర్త మరణించినందున ఫ్యామిలీ పెన్షన్ వస్తున్నది. ఆమె జీతం మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండూ ఆదాయపు పన్నులో చూపించాలా? ఎలా చూపించాలి?
**జవాబు**: ✅ అవును, ఆమె జీతం మరియు పెన్షన్ రెండూ ఆదాయపు పన్ను మదింపు కోసం చూపించాలి. ఫ్యామిలీ పెన్షన్ ను ఇతర ఆదాయంలో చూపించాలి.
18. ప్రశ్న: 📅 ఒక ఉపాధ్యాయుడు జనవరి నుండి డిసెంబర్ వరకు సస్పెన్షన్ లో ఉన్నారు. అనంతరం డిసెంబర్ 21న విధులలో చేరారు. సస్పెన్షన్ కాలానికి అర్ధజీతపు సెలవు మరియు సంపాదిత సెలవు మంజూరు చేసారు. అతని ఇంక్రిమెంట్ సెప్టెంబర్ మాసంలో వుంది. ఇంక్రిమెంట్ ఎప్పుడు మంజూరు చేస్తారు?
**జవాబు**: 🗓️ సస్పెన్షన్ కాలానికి అర్ధజీతపు మరియు సంపాదిత సెలవు మంజూరైనందున, సెప్టెంబర్ మాసంనుండే ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. అయితే ఆర్థిక లాభం ఆయన విధులలో చేరిన డిసెంబర్ 21 నుండి ఇస్తారు.
19.ప్రశ్న: 📚 1995 డిఎస్సి ద్వారా SGT గా చేరిన ఉపాధ్యాయుడు 2009లో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందాడు. మరొక ఉపాధ్యాయుడు 1996 DSC ద్వారా SGT గా చేరి 2009లో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందాడు. ఇద్దరిలో ఎవరు సీనియర్?
**జవాబు**:: 🥇 పాఠశాల విద్య కమీషనర్ ఉత్తర్వులు ప్రకారం, 1995 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడే సీనియర్ అవుతాడు.
20. ప్రశ్న: 👶 మా కుమారుని వయస్సు 20 సం.లు, డిఎంఎల్ టి చదువుతున్నారు. గతంలో నేను 60 రోజులు Child Care లీవు వాడుకున్నాను. మిగిలిన 120 రోజులు సెలవు ఇప్పుడు వాడుకోవచ్చా? వయోపరిమితి తొలగించారంటున్నారు వాస్తమేనా?
**జవాబు**:: 📜 ఇటీవల ఇచ్చిన ఎంఎస్ నం.36 GAD ప్రకారం, “Miner Child” అనే పదాన్ని ఉపయోగించారు. 18 సంవత్సరాలు దాటిన పిల్లల కోసం Child Care లీవు వర్తించదు.
income tax saving & expenditure submitted form🙏
🙏